యోగాతోనే మానసిక ప్రశాంతత
22-06-2026 12:00 AM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, జూన్ 21 (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోవత్సవం సందర్భంగా జనగామ నెహ్రు పార్క్ నుండి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు.
ర్యాలీ అనంతరం సామూహిక యోగా కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. మల్లిఖార్జున్ రావు అద్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో యోగా ఆసనాలు వెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ కోఆర్డినేటర్ డాక్టర్ మమత, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.






