calender_icon.png 24 January, 2026 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసిక ఉల్లాసం

24-01-2026 12:37:48 AM

ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి మొహహ్మద్ రఫీ

మహబూబాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిం చడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తాయని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయస్థానం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు జడ్జి మహహ్మద్ రఫీ అన్నారు. శుక్రవారం స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ మున్నా ఆధ్వర్యంలో న్యాయవాదులకు క్యారమ్, చెస్‌క్రీడలను నిర్వహించగా ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. మన దైనందిన, వృత్తిపరమైన కార్యక్రమాల్లో విరామం లేకుండా పని చేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవడం సహ జం అన్నారు. ప్రతి రోజు ఉదయం నడక, వ్యాయామం, ధ్యానం చేయడంతో పాటు క్రీడలు కూడా ఆడాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ్, జిల్లా కోర్టు పీపీ కోంపెల్లి వెంకటయ్య,

జీపీలు తోర్నాల నగేశ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తుంపిళ్ల శ్రీనివాస్, ఏజీపీ ఆరెళ్లి శ్రీనివాస్, ఏజీటీ సునీత, బార్ కోశాధికారి దూదిమట్ల మహేందర్, న్యాయవాదులు దాసరి నాగేశ్వర్ రావు, కేశవరావు, పుల్లూరు కృష్ణయ్య, ఉడుగుల హరికృష్ణ , గాదె కమల్ కుమార్, శ్రీనివాసస్వామి, ముత్యాలు యాదవ్ కట్కూరి శ్రీని వాస్, ఉడుగుల రాజ్ కృష్ణ, వాసం ఆనంద్, దర్శనం రామకృష్ణ, పిన్ని రాము, బస్కె మధు, ఉమామహేశ్వర్‌రావు, చిట్యాల నరే ష్, సతీష్, మహిళా న్యాయవాదులు రాజమణి, దేవి, ప్రవీణ, సునీత పాల్గొన్నారు.