calender_icon.png 24 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల దాడిలో పది గొర్రెలు మృతి

24-01-2026 12:37:58 AM

చేగుంట, జనవరి 23: చేగుంట మండలం చందాయిపేట్ గ్రామ పంచాయతీ గ్రామంలో వీధి కుక్కల దాడిలో పది గొర్రె లు మరణించాయి. గొర్రెల కాపరి, రైతు శాలిపేట ఈశ్వర్ తమ ఇంటి పక్కన దొడ్డిని ఏర్పాటు చేసుకొని తన గొర్రెలను పెంచుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం వీధి కుక్కలు గొర్రెల మందపై దాడికి తెగబడ్డాయి, దీంతో 10 గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. తనకు సుమారు లక్ష నష్టం వాటి ల్లినట్టు బాధితుడు ఈశ్వర్ వాపోయాడు.