calender_icon.png 15 July, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈవో

15-07-2025 12:00:00 AM

కృష్ణ జులై 14. మండలంలోని వంశీ ప్రాథమిక పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి నిజముద్దీన్ ఆకస్మికంగా పనికి నిర్వహించి పాఠశాలలోని ఉపాధ్యాయుల విద్యార్థుల హాజ రు మధ్యాహ్న భోజనం రికార్డులను పరిశీలించారు అనంతరం నాల్గవ ఐదవ తరగతి విద్యార్థుల పట్టణ సామర్థ్యాన్ని తెలుగు ఆంగ్లంలో కొంతమంది విద్యార్థులచే చదివించి ఇంకా మెరుగుపడాలని సూచించారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు అదేవిధంగా గణితంలో చతుర్విధ ప్రక్రియలు మొదలైన వాటితో చర్చించి వీటన్నిటిని పాఠశాల స్థాయిలోనే నేర్చుకోవాలని సూచించారు అలాగే ఉన్నత పాఠశాలలోని తరగతి విద్యార్థులతో పలు అంశాలను చర్చించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వర ఉన్నత పాఠశాల ప్ర ధానోపాధ్యాయులు సంతోషి ఉపాధ్యాయులు అనిత అశోక్ అమృత ప్రియాంక సుప్రజ కాశీం అలీ నరసింహులు నరేంద్ర సౌమ్య భారతి తదితరులుపాల్గొన్నారు.