20 June, 2026 | 3:28 AM

పకడ్బందీగా భూధార్ సర్వే

20-06-2026 01:45 AM

నిర్మల్ జూన్ 19 ( విజయ క్రాంతి)భూధార్ సర్వేను పకడ్బందీగా నిర్వహించి, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. గురువారం రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ భూధార్ సర్వే పై పలు సూచనలు చేసినట్టు వివరించారు.పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, అలాగే భూభారతి దరఖాస్తులను నిర్ణీత 60 రోజుల గడువులోగా పరిష్కరించేలా చర్యలు వెంటనే చర్యలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

భూధార్ సర్వే నిర్వహణకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని, సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, ఏడి ల్యాండ్ సర్వేయర్ నరసింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.