20 June, 2026 | 3:29 AM

ఆర్ధిక మంత్రికి కాసుల గలగల తప్ప.. రైతుల కష్టాలు తెలియడం లేదు..

20-06-2026 01:45 AM

రైతు భరోసా వెంటనే అందరికి ఇవ్వాలి

టీఆర్‌ఎస్ నేత లింగాళ కమళరాజు

మధిర, జూన్19 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్ధిక మంత్రికి కాసులు గలగల తప్ప రైతుల కష్టాలు తెలియటం లేదని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులకు రైతుబంధు రైతు భరోసా వారి అకౌంట్లో జమ కావడం లేదని రైతుల కష్టాలను తెలుసుకున్న ఏకైక వ్యక్తి చంద్రశేఖర రావు అని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా సమస్యల కంటే కమిషన్ల మీద శ్రద్ధ ఎక్కువైందని రైతులపై పట్టింపు లేదని విమర్శించారు.

మధిర పట్టణంలో పాలన పడక వేసింది దళారుల రాజ్యంగా మారిందని అన్నారు. అలాగే ఈనెల 22వ తారీఖున స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కొరకు నియమించిన బిఎల్‌ఎ బూత్ లెవెల్ ఏజెంటు మరియు బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కొరకు పార్టీ నియమించిన సమన్వయకర్తల కు శిక్షణ సమావేశం ఏర్పాటు చేశామని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ తక్కెళ్ళపల్లి రవీందర్రావు సభ్యత్వ మధిర నియోజకవర్గం ఇంచార్జ్  నామ నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు తాత మధు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. 

ఈ సమావేశాన్ని కార్యకర్తలు నాయకులు అభిమానులు నియమించబడిన బిఎల్‌ఏ, సభ్యత్వ నమోదు సమన్వయకర్తలు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.  బిక్కి కృష్ణ ప్రసాద్, పల్లపోతు వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు