27 August, 2026 | 3:15 AM

మిలాద్ ఉన్ నబీ సేవాస్ఫూర్తికి నిదర్శనం

27-08-2026 02:28 AM

మాజీ మంత్రి చంద్రశేఖర్

జహీరాబాద్, ఆగస్టు 26: మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని జహీరాబాద్ నియోజకవర్గంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం నాడు మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా జహీరాబాద్ లోని ఈద్గా వద్ద తొమ్మిది పెళ్లిలను నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ కమిటీ సభ్యులు ఉచితంగా వివాహాలు జరిపించి వారికి కావలసిన సామాగ్రిని అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ఆదుకునేందుకుగాను రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ మంత్రి చంద్రశేఖర్ ఈద్గా వద్దకు వెళ్లి వారికి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు భక్తిశ్రద్ధలతో పండగను జరుపుకోవడమే కాకుండా బీద పరిస్థితిలో ఉన్నవారికి ఉచితంగా పెళ్లిళ్లు జరిపించి వారిని ఆదుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ మొహమ్మద్ యూనుస్, మున్సిపాలిటీ కమిషనర్ జి .ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండెం నరసింహులు, కౌన్సిలర్ మహేష్ కుమార్ ,సర్పంచ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ ,గౌస్, ఇనాయత్ ,అజార్ ,మోయిన్, సోహెల్ ,మిలాద్ ఉన్ నబి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.