5 May, 2026 | 3:33 AM

మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

05-05-2026 02:05 AM

మంథని మే4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సిఆర్ ఆర్ (ఎస్ సి కాంపౌనెంట్ ) క్రింద మంజూరైన మంథని మండలానికి రూ. 3.30కోట్లు రూపాయలు చేపించినందున మంథని అంబేడ్కర్ చౌరస్తాలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్ధిళ్ల శ్రీనుబాబు చిత్రపటలకు సోమవారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్ ఆధ్వర్యంలో  పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంథని డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మంతెన సత్యం, మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగారావు, మంథని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్ లు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దళితవాడలలో ప్రతి సంవత్సరం అనేక కోట్లు నిధులతో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజ్, వీధిలైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమాలు తీసుకొస్తున్నారని, అలాగే ఈ ప్రాంతంలో ఎస్సీ కులస్థులంటే శ్రీధర్ బాబుకి శ్రీపాద రావుకి శ్రీను బాబుకి ప్రత్యేక అభిమానం ఉంటదని, దళితులను రాజకీయంగా, ఆర్థికంగా, సమాజంలో వారిని గుర్తింపు చేస్తున్నారని, ఈ జాతుల కోసం మంత్రి శ్రీధర్ బాబు చాలా కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఉప సర్పంచ్ లు, వార్డ్ నెంబర్లు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.