5 May, 2026 | 3:32 AM

కేరళంలో చారిత్రాత్మక విజయం

05-05-2026 02:05 AM

సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి) : కేరళంలో యూడీఎఫ్ కూటమి విజయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా  స్పందించారు. ఇలాంటి అసాధారణమైన, కఠోరమైన స్పూర్తిదాయకమైన విజ యం సాధించినందుకు నాయకులకు, కార్యకర్తలను అభినందించారు.

ఈ చారిత్రాత్మక విజయానికి నాయకత్వం వహించిన రాహుల్‌గాంధీ, మల్లిఖాకార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షులకు, పార్టీ కేడర్‌కు అభినందనలు తెలుపు తున్నట్లు పేర్కొన్నారు. కేరళం ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై ప్రమే కురిపించినందుకుగాను యూడీఎఫ్ మద్దతుదా రులకు, ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున ఎల్లప్పుడు కృతజ్ఞుడనై ఉంటానని సీఎం పేర్కొన్నారు. కేరళం, తెలంగాణ రాష్ట్రాలు ప్రజలు ప్రగతిశీల విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిగల ప్రజలని అన్నారు.