18-04-2025 10:20:38 PM
మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలోని కేకే 5 గనిపై గని యజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి)తో నిర్వహించిన మైన్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం ఏఐటియుసి మైన్ కమిటీ సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ గని కార్యదర్శి గాండ్ల సంపత్ మాట్లాడుతూ గనికి కొత్తగా వచ్చిన మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా మైన్ కమిటీ కమిటీ సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని అన్నారు. గతంలో జరిగిన మైన్స్ కమిటీ సమావేశంలో యాజమాన్యం దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను ఇంతవరకు నెరవేర్చలేదని ఆరోపించారు.
ఈ విషయమై సభ్యులు గని మేనేజర్ ను ప్రశ్నిస్తే, పిట్ కార్యదర్శితో మాట్లాడను, కమిటీ సభ్యులతోనే మాట్లాడతానని యూనియన్ ను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా గని మేనేజర్ ని అంటూ స్వయంగా కార్మికులకు తన ఫోన్ నెంబరు ఇచ్చి, ఏదైనా సమస్య ఉంటే యూనియన్లకు కు సంబంధం లేకుండా, నేరుగా తనని కలవాలని చెబుతూనే, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కలిస్తే, వారితో ఇబ్బందిగా మాట్లాడటమే కాకుండా, వారిని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రశాంతంగా గని 107 శాతం బొగ్గు ఉత్పత్తి సాధిస్తే, కొత్తగా వచ్చిన మేనేజర్ కార్మికుల్లో అలజడి సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా మేనేజర్ తన మొండి వైఖరిని మార్చుకోకుంటే గుర్తింపు కార్మిక సంఘంగా ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పిట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.