calender_icon.png 21 January, 2026 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి భట్టి సెల్ఫ్ గోల్!

21-01-2026 01:31:49 AM

  1. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల రద్దుతో ఆరోపణలకు బలం?

జవాబుదారీతనం కోసమే రద్దు అంటూ మరో వాదన   

ప్రత్యామ్నాయం.. సింగరేణి సొంతంగా బొగ్గు వెలికితీయడమే!

రూ. 5,000 కోట్ల ఆదాకు అదే మార్గమంటున్న విశ్లేషకులు

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): ఉప ముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక శాఖలను నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క.. నైనీ బొగ్గు బ్లాక్‌లో గనుల తవ్వకం టెండర్లను రద్దు చేస్తున్నట్టు మూడురోజుల క్రితం ప్రకటించారు. కొన్ని కంపెనీలకు అనుకూలంగా, ప్రయోజనం చేకూర్చేలా టెండర్  నిబంధనలను రూపొందించారని తీవ్ర ఆరోప ణలు వచ్చిన నేపథ్యంలో.. సదరు టెండర్లను రద్దు చేస్తూ ఈ నిర్ణయం వెలువ డింది.

తాము తీసుకున్న ఈ టెండర్ రద్దును ‘అనుమాన నివృత్తి’ చర్యగా అభివర్ణిస్తూ.. తమ పరిపాలనలో పారదర్శక తను మంత్రి నొక్కి వక్కాణించారు. అయి తే ఇది పరిపాలనా ప్రక్రియలోని లోపాలను ఒప్పుకోవడమేనని, దీనివల్ల పెట్టు బడిదారుల విశ్వాసం దెబ్బతినడమే కాకుండా బొగ్గు ఉత్పత్తి ఆలస్యమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఒక బిడ్డర్‌కు అనుకూలంగా మార్గదర్శకాలను రూపొందించేలా ఒక మీడి యా సంస్థ కుట్ర పన్నిందని పత్రికల్లో వచ్చిన కథనాలతో ఈ వివాదం మొదలైంది. ప్రతిపక్ష భారత రాష్ర్ట సమితి (బీఆ ర్‌ఎస్) నాయకుడు హరీశ్‌రావు ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. దీనితోపాటు సింగరేణిలో జారీచేసిన ఇతర టెండర్లనుకూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అంచనాల కంటే -7 శాతం తక్కువకే టెండర్లు ఖరారు కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అంచనాల కంటే 7 నుంచి 10 శాతం ఎక్కువకు ఖరారు చేస్తున్నారని, ఇది అవినీతికి దారితీస్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

ఇటీవల ప్రజాభవన్‌లో విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. ఎటువంటి బిడ్లు ఇంకా దాఖలు కాలేదని, టెండర్ల ప్రక్రియ అంతా ప్రభుత్వ రంగ సంస్థల నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. సైట్ విజిట్ అనే నిబంధన కేవలం బిడ్డర్ల సామర్థ్యాన్ని పరీక్షించడానికేనని చెబుతూనే.. పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లకు ఆదేశించారు.

ఆరోపణలకు బలం..?

డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించిన ‘టెండర్లను రద్దు’ నిర్ణయం ‘సెల్ఫ్ గోల్’ అని విమర్శకులు అంటున్నారు. టెండర్ల రద్దు నిర్ణయం అనేది ఒకవైపు జవాబుదారీతనాన్ని చాటిచెప్పడం ద్వారా సింగరేణి ప్రతిష్టను కాపాడే ప్రయత్నమని అం టూనే.. కాంట్రాక్ట్ ఇవ్వకముందే ప్రక్రియ ను నిలిపివేయడమనేది టెండర్లపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందని విమర్శకులు అంటున్నారు.

దీనితో బొగ్గు రంగంలోని రావాలనుకున్న పెట్టుబడిదారులు వెనకడుగు వేసే అవకాశం ఉంది. 1.5 బిలియన్ టన్నుల వార్షిక బొగ్గు డిమాండ్ ఉన్న తరుణంలో, నైనీ ప్రా జెక్టు ఆలస్యం కావడం దేశ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతుందనే చెప్పవచ్చు.

ప్రత్యామ్నాయం..

టెండర్లు ఇంతటి వివాదాస్పదం అయి న సందర్భంలో.. దీనికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. సింగరేణి సంస్థే నేరుగా 20 ఉప-కాంట్రాక్టర్ల ద్వారా ఈ ప్రాజెక్టులో బొగ్గు తవ్వకాలను చేపట్టడం అనేది ప్రత్యామ్నాయంగా కనపడుతోంది. ఎందుకంటే.. బొగ్గు తవ్వకాలు, రవాణా వంటి ప నులలో సింగరేణికి దశాబ్దాల అనుభవం ఉంది. అలాగే రెగ్యులర్‌గా చిన్న చిన్న పనులకు పారదర్శకంగా టెండర్లను పిలిచి పనులు అప్పగించవచ్చు.

ప్రస్తుతం సింగరేణి సంస్థ చాలా చోట్ల తవ్వకాలు, ఎక్వి ప్‌మెంట్ హైరింగ్, ఓబీ తొలగింపు, డ్రిల్లిం గ్, ట్రాన్స్‌పోర్ట్ లాంటి పనులను సబ్ కాం ట్రాక్టుకు ఇవ్వడం ద్వారా భారీ ఆదాయానికి గండి పడకుండా లాభాలను ఒడిసిప డుతోంది. ఇలా.. 2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో ఉన్న సుమారు 40 వేల మంది కార్మికులు కలిసికట్టుగా తెలంగాణ ఆర్థిక ప్రగతికి సుమారు రూ.32 వేల కోట్ల రెవెన్యూను అందించారు. 

తాజా టెండర్లలో గంపగుత్తగా బొగ్గు తవ్వ కం, ఓబీ తొలగింపును పనులను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకుండా.. సింగరేణి సంస్థ ఆయా పనులను చేపడితే ప్రైవే టు కంపెనీలకు మిగిలే 10 శాతం మార్జిన్లను నివారించవచ్చు. దీనివల్ల దాదాపు రూ.5,000 కోట్లు ఆదా చేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపిస్తున్నట్లుగా టెండర్లలో 20 శాతం ఎక్కువ అంచనాలు ఉంటే, సింగరే ణి సంస్థే నేరుగా పనులు చేపట్టడం వల్ల ఈ భారీ వృథాను అరికట్టవచ్చు. 

ఈ టెండర్ తతంగంలో ఇప్పటివరకు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. మొత్తానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రక టించిన నిర్ణయంతో.. తక్షణం కుంభకోణా న్ని నివారించినప్పటికీ, తెలంగాణ ఇంధన స్వయంప్రతిపత్తికి కీలకమైన నైనీ బ్లాక్ నుండి వచ్చే ప్రయోజనాలు కాస్త ఆలస్యం కావచ్చు. అయితే కొత్త టెండర్లు పారదర్శకంగా జరిగితే, అది సరైన నిర్ణయం అనిపించుకుంటుంది. 

అలా కానిపక్షంలో, భట్టి ప్రకటించిన నిర్ణయం.. విలువైన సమయాన్ని, విశ్వసనీయతను కోల్పోయే విధంగా ‘సెల్ఫ్ గో ల్’గానే మిగిలిపోతుం ది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుం టే.. అవినీతి రహిత ఆ ర్థిక నిర్వహణ అనేది ప్రస్తుతం అత్యవస రం. ప్రభుత్వం భవి ష్యత్తులో తీసుకునే ని ర్ణయాన్ని బట్టి ఇది తే టతెల్లం అవుతుంది..!