calender_icon.png 27 September, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజమైన ప్రజానాయకుడు కొండా లక్ష్మణ్

27-09-2025 12:42:37 PM

మాట ఇచ్చి ఆచరించిన మహనీయుడు

వారి మాటలు, చేతలు నేటి తరానికి స్ఫూర్తి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): నిజమైన ప్రజానాయకుడు “కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Lakshman Bapuji) అని రాష్ట్ర రోడ్డు భవనములు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkata Reddy) అన్నారు. ఆయన 110వ జయంతి సందర్భంగా శనివారం  జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ సాధించే వరకు ఏ పదవీ చేపట్టనని మాట ఇచ్చి ఆచరించిన మహనీయుడు అని కొనియాడారు.

 వారి మాటలు, చేతలు నేటి తరానికి స్ఫూర్తి”  అని పేర్కొన్నారు. పేదవారి అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. వారి స్ఫూర్తితోనే నేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేశానని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాకారం చేసే దిశగా కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాయింట్ కలెక్టర్  శ్రీనివాస్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.