calender_icon.png 27 September, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లెక్సీలను కూడా ఓర్వడం లేదు..

27-09-2025 12:59:33 PM

మమ్మల్ని ఎదగనివ్వరా...?

దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి

జిన్నారం : కొన్ని వర్గాల వారు కొత్తగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న  వారిని అణచివేస్తున్నారని, తాము వేసుకుంటున్న ఫ్లెక్సీలను కూడా చూసి ఓర్వలేక చించి వేస్తున్నారని  జిన్నారం మండల బీజేపీ కార్యదర్శి రమణ సింగ్(BJP Secretary Raman Singh) విమర్శించారు. తాము పెట్టిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే చింపి వేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కుంట ప్రజలకు బతుకమ్మ ఘాట్ నిర్మిస్తామని ఇచ్చిన మాట  కోసం గురువారం సాయంత్రం జిన్నారం మండల  బిజెపి పార్టీ ఆధ్వర్యంలో  మంత్రి కుంట బతుకమ్మ ఘాట్, మాదారం పంచముఖి హనుమాన్ విగ్రహం పరిశీలన వంటి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు,  ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను ఆహ్వానించి వారి చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.  కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుచరులు కొందరు  ఫ్లెక్సీలు పూర్తిగా చించి వేసినట్లు తెలిపారు.

దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి

కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుచరులు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని రమణ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  గత 20 ఏళ్లుగా  రాజకీయాలు చేస్తున్నామని, పండుగలు, ఇతర కార్యక్రమాలకు ఫ్లెక్సీలు వేస్తున్నామని, ఎప్పుడు కూడా ఇలా చించివేత లాంటి నీచ రాజకీయాలు చూడలేదన్నారు. రాజకీయ కక్ష్యలు ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలని, ఇలాంటి చేతకాని చర్యలకు పాల్పడితే ఇకమీదట ఊరుకునే ప్రసక్తేలేదని రమణ సింగ్ హెచ్చరించారు.