calender_icon.png 27 September, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ ఆర్టీసీ ప్రహరీ ఇన్ గేట్ వసతి కల్పించాలని ఎమ్మెల్యేకు విన్నపం

27-09-2025 12:50:44 PM

 ఆందోళన చెందుతున్న బస్టాండ్ ప్రాంత వ్యాపారస్తులు 

ఖానాపూర్, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్(Khanapur RTC protestors) నట్ట నడిమిన ఉన్న ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ఇటీవల ఆర్టీసీ అధికారులు కాంపౌండ్ వాల్ నిర్మించి కేవలం ఒకటే గేటు పెట్టి, దానిలో నుంచే ఇన్ ఔటు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు చూడు చేసుకుంటున్నాయని అంతేకాకుండా బస్టాండ్ చుట్టూ ఉన్న వ్యాపారాలు నష్టపోతున్నాయని పేర్కొంటూ, గతంలో లాగా బస్టాండ్ వెనుక భాగాన ఇన్ గేట్ సౌకర్యం కల్పించాలని స్థానిక వ్యాపారస్తులు,  ప్రజలు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను శుక్రవారం అందరూ కలిసి విన్నపం చేశారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు వ్యాపారస్తులు స్థానికులు ఆయనను కలిసి మెమొరండం అందజేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తాను ఇదివరకే ఆర్టీసీ అధికారులతో మాట్లాడాలని, కచ్చితంగా ఇన్ గేట్ సౌకర్యం కల్పిస్తామని, తాను స్వయంగా ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తామని, వ్యాపారులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు మొగిలి సుభాష్ , ఇస్థారి సుమన్ ,రాకేష్ ,షికారి రవి ,లక్ష్మణ్, చిట్టి, ఏసుదాస్ రెడ్డి మల్ల, సన్నిత్, భీమ్రావు ,గంగాధర్, కట్ట రాజన్న, పలువురు ఉన్నారు.