calender_icon.png 27 September, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ

27-09-2025 12:32:32 PM

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) సమావేశం అయింది. ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, అదనపు డీజీ మహేశ్ భగవత్, పంచాయతీరాజ్, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శులు, ఎక్సైజ్ కమిషనర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పలు విభాగాల అధికారులతో చర్చలు జరిపారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక జీవో జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.