13 August, 2026 | 2:49 AM

కాలభైరవుని సన్నిధిలో మంత్రి కొండా సురేఖ కుటుంబం పూజలు

13-08-2026 12:19 AM

ఖైరతాబాద్, ఆగస్టు12 (విజయక్రాంతి): నాంపల్లి దేవిబాగ్లోని శ్రీ కాలభైరవ స్వామి (భైరవ బాబా మందిర్) ఆలయాన్ని రాష్ట్ర అట వీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్ రావు దంపతులు బుధవారం దర్శించుకున్నారు.

వారితో పాటు కుమార్తె సుస్మి తా పటేల్, అల్లుడు అభిలాష్ పటేల్ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించినట్లు వెల్లడించా రు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.