13 August, 2026 | 2:45 AM

జవహర్‌నగర్‌లో అధికారుల పర్యటన

13-08-2026 12:19 AM

సమస్యలపై ఆరా

జవహర్‌నగర్, ఆగస్టు 12 (విజయక్రాం తి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్నగర్లో అధికారులు విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ రాధిక గుప్తా, సంచిత్ గంగాయర్ తదితర అధికారులు జవహర్నగర్లోని పలు కాలనీల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా సంతోష్నగర్, పాపయ్యనగర్ కాలనీల్లో పర్యటించిన అధికారులు అక్కడి మౌలిక వసతులు, పారిశుద్ధ్య పరిస్థితులు, డ్రైనేజీ వ్యవస్థ, ఓపెన్ నాలాల సమస్యలను పరిశీలించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నాలాలు పొంగిపొర్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.