2 July, 2026 | 4:03 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ప్రజా ప్రభుత్వంతోనే ప్రతి ఒక్కరికీ న్యాయం...

31-05-2025 12:01 AM

అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హనుమకొండ, మే 30 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని  అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్ లోని తమ నివాసంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు హనుమకొండలోని తమ నివాసానికి చేరుకొని సమస్యలు మంత్రికి విన్నవించారు.

ప్రతి సమస్య వింటూ, పరిష్కారం చూపుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదల సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులు గా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.