03-01-2026 01:01:33 PM
హైదరాబాద్: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తుందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సూచించారు. కొంతమంది తమ నియోజకవర్గాల కోసం అదనపు గృహ కేటాయింపులు కోరుతున్నారని, అటువంటి డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని(BRS government) విమర్శిస్తూ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపైన దృష్టి పెట్టడంలో పాలకులు విఫలమయ్యారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. పేదల పాలిట ఇల్లు అనేది ఆత్మగౌరవానికి ప్రతీకన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి 36 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. గత పాలనలో పేదలకు ఇళ్లు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనువైన భూముల్లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలుస్తుందని పొంగులేటి పునరుద్ఘాటించారు.