03-01-2026 01:03:37 PM
వాంకిడి (విజయ క్రాంతి): విద్యలో అగ్రగామిగా నిలిచి మహిళలందరికీ ఆదర్శ మూర్తిగా సావిత్రిబాయి పూలే నిలిచారని మాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్నూలే నారాయణ అన్నారు. వాంకిడి మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆమె సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి బాలికల విద్యా ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.