07-01-2026 01:06:52 AM
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): అసెంబ్లీలో సోమవారం కేంద్రం తెచ్చిన జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదాలు సాగా యి. మజ్లిస్ పార్టీ పక్షనేత అక్బరుద్దీన్ ఒ వైసీ మాట్లాడుతూ.. జీఎస్టీ చట్టం తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నదని విమర్శించారు. దీనిపై బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పంది స్తూ కేంద్ర నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ సవరణ బిల్లును అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని గుర్తు చేశారు.
ఎంఐఎం నేత విమర్శలకు అర్థం లేదని మండిపడుతూ.. తమ కు ఈ బిల్లుపై వివరణకు అవకాశం ఇవ్వడంలేదంటూ పోడియంలోకి దూసుకెళ్లడంతో వాతా వరణం వేడెక్కింది. కాగా, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. వన్ నేషన్ వన్ టాక్స్ పేరుతో దేశవ్యాప్తంగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసిన జీఎస్టీ ప్రకారం తిరిగి రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని వాపోయారు. జీఎస్టీలో తెలంగాణకు తక్కువ వాటాను కేంద్రం ఇస్తోందని, జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఇస్తున్నదని చె ప్పారు.
జనాభా ఆధారంగా రాష్ట్రాలకు నిధులు కేటాయించడం సరైన విధానం కాదని హితవు పలికారు. అంతేకాకుండా ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ హయాంలో డాలర్ విలువ పెరిగి, రూ పాయి విలువ పతనమైందని, యూపీఏ హ యాంలో డాలరు విలువ రూ.63.-72 గా ఉండేదని, ఇప్పుడు రూ.90 దాటిందని చెప్పారు. ఆ తర్వాత ఓవైసీ సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరిశ్‌బాబు, ధన్‌పాల్ సూర్యనారాయణ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవగాహన లేకుండా రాష్ట్ర జీఎస్టీ బిల్లుపై మాట్లాడటం సరికాదన్నారు. జీఎస్టీ పేరుతో అధికారులు చిరు వ్యాపారులపై వేదింపులను ఆపాలని కోరారు.
అక్బురుద్దీన్, మహేశ్వర్‌రెడ్డి మాటల యుద్ధం
అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్ ఓవైసీ, బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎస్‌ఐఆర్ చర్చలో భాగంగా అక్బుర్దీన్ మాట్లాడుతూ బీహర్, బెంగాల్‌లో మైనార్టీ ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రి య సరిగా జరగలేదని, బెంగాల్‌లోనూ వేలాది మంది ఓటర్లను తొలగించేందుకు కుట్ర చేశారని, దీనిపై తమకు అనేక అనుమానాలు ఉన్నా యన్నారు. ఎన్ని అక్రమాలు చేసినా శిక్షపడకుండా ఉండాలంటే బీజేపీ సభ్యత్వం తీసుకుం టే చాలని, అప్పుడు ఎంత అవినీతికి పాల్పడినా క్లీన్‌గా మారిపోతారని విమర్శించారు.
దీంతో బీజేపీ వాషింగ్ మిషన్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో ఇరు వర్గాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో సభ వేడిక్కింది. అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను బీజేపీ ఎల్పీ నేత మహేష్‌కుమార్‌రెడ్డి తప్పుపట్టారు. ‘హౌస్‌ను అక్బరుద్దీన్ ఎలా డిక్టేట్ చేస్తారు. ఎస్‌ఐఆర్ మీద ఇష్టారాజ్యాంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు ఆపడం లేదు. ఎంఐఎం వాళ్లు తిడితే మైక్ కట్ చేయరు.
మేం మాట్లాడితే మాత్రం వెంటనే మైక్ కట్ అవుతుంది. ఇదెక్కడి న్యా యం? ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేకంగా చర్చపెట్టండి. ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేసు కుని రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. ఎస్‌ఐఆర్ ద్వారా బీహార్‌లో 50 లక్షల ఓట్లు తొలగించారు. బీహార్, యూపీ కాదు దేశం మొత్తం ఎస్‌ఐఆర్ తెస్తున్నారు. ఇందులో హిందూ, ముస్లిం తారతమ్యం లేదు ’ అని మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశా రు. అవినీతి, ఆరోపణలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహా రిస్తోందన్నారు.