18 April, 2026 | 4:16 AM

హైడ్రా భయం ఇప్పుడు ప్రజల్లో లేదు

16-12-2024 05:38 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో హైడ్రా భయం ఇప్పుడు ప్రజల్లో లేదని, హైడ్రాపై తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పడు ప్రజలకు వాస్తవాలు తెలిశాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అప్పులపై కేటీఆర్ నిజాలు తెలుసుకోవాలని మంత్రి మండిపడ్డారు. కార్పొరేషన్ల పేరుతో చేసే అప్పులు కూడా ప్రభుత్వ ఖాతాలోకే వస్తాయనేది కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్టంపై రూ.7.20 లక్షల కోట్ల అప్పు ఉందని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన సభలో ఉండగా మాట్లడాలని ఉందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో కూడా ఇలానే ప్రచారం జరిగిందని గుర్తు చేశారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని, ఏపీలో చంద్రబాద్ సీఎం కాగానే అక్కడికి పోతుందనేది ప్రచారం మాత్రమే అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి రూ.12000 ఇవ్వడంతో 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతికి రైతు భరోసా, ఆసరా పెన్షన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దీంతో రెండు, మూడు సంవత్సారాలతో పోల్చుకుంటే స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. అమరావతిలో వరదల వల్ల ఏపీకి ఇన్వెస్ట్ మెంట్ వెళ్లే పరిస్థితి లేదని, అక్కడ ఇన్వెస్ట్ మెంట్ పెట్టాలంటే భయపడుతున్నారన్నారు. ఇన్వెస్టర్స్ హైదరాబాద్, బెంగుళూరు వస్తున్నారని మంత్రి పొగులేటి మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు.