18 April, 2026 | 3:02 AM

గురుకులాలు మూతపడే పరిస్థితి వచ్చింది: సబిత

16-12-2024 04:54 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు లేని పాఠశాలల గురించి తెలంగాణ సర్కార్ ను అడుగుతే సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో గురుకులాలు మూతపడే పరిస్థితి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అములు కావట్లేదని సబిత విమర్శించారు. ఈ ఒక్క ఏడాదే 6 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయన్నారు. మధ్యాహ్నం భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు గురుకులాల బాట పడితేనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. సర్కార్ బడుల్లో టీచర్ల నియామకం చేసిన తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. మూతపడిన పాఠశాలలు తెరిచి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని సబిత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.