18 April, 2026 | 6:03 AM

బొమ్మ తుపాకీతో బెదిరించి బార్‌లో దోపిడీ

16-12-2024 06:17 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బొమ్మ తుపాకితో బెదిరించి బార్ లో దోపిడికి పాల్పడిని వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 9వ తేదీన రాయదుర్గంలోని తేవర్ కిచెన్ అండ్ బార్ లో క్యాషియర్ గా పని చేస్తున్న శుభమ్ కుమార్ తన స్నేహితుడు విశ్వజిత్ డమ్మీ తుపాకితో భద్రతా సిబ్బందిని బెదిరించి, బార్ యజమానిని రూమ్ లో బందించి రూ.450 లక్షలు, ఐ ప్యాడ్, ఆపిల్ ల్యాప్ టాప్ ను చోరి చేశారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు బార్ దగ్గరకు రాకన ముందే దోపిడి దారులు పరారయ్యారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు సోమవారం సుభం కుమార్ అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి విశ్వజిత్ కోసం గాలిస్తున్నారు. శుభమ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తనను విధుల నుంచి తొలగించడాన్ని కక్ష పెంచుకొని ఈ దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు అంగికరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడు శుభమ్ ను రిమాండ్ కు తరలించారు.