12-05-2025 07:01:40 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నాలుగు గ్రంథాలయాలకు భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు అయినట్టు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజ్జుమత్ అలీ తెలిపారు. జిల్లాలోని సోన్ దిల్వార్పూర్, మామడ, సారంగాపూర్ మండల కేంద్రంలో గ్రంథాలయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున నాలుగు గ్రంథాలయాలకు రూ.80 లక్షలను జిల్లా కలెక్టర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో అన్ని గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని వివరించారు.