calender_icon.png 12 May, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసరలో హౌస్ కీపింగ్ వర్కర్ల నిరసన

12-05-2025 07:15:04 PM

బైంసా,(విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీ లో హౌస్ కీపింగ్ నిర్వహిస్తున్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సోమవారం త్రిబుల్ ఐటీ గేటు ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నో సంవత్సరం నుంచి తాము తక్కువ పనులు చేస్తున్నామని వేతనాలు పెంచాలని కార్మికులను అన్యాయంగా తొలగించవద్దని ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లను చేశారు. ఇప్పటికే తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందని న్యాయం చేయకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హౌస్ కీపింగ్ కార్మికులు తెలిపారు.