calender_icon.png 12 May, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల శిక్షణకు హాజరు కాకపోతే చర్యలు

12-05-2025 06:57:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈనెల 13 నుంచి 17 వరకు విద్యాబోధన సామర్థ్యం స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని శిక్షణకు ఉపాధ్యాయులు హాజరు కాకపోతే చర్యలు ఉంటాయని డీఈఓ రామారావు తెలిపారు. ఆదివారం డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు బోధనా స్థాయి పెంపు ఉపాధ్యాయులకు ఎంతో అవసరమని వివరించారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఉంటాయని ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సదిరించుకోవాలని కోరారు.