12-05-2025 07:12:05 PM
బైంసా,(విజయక్రాంతి): భైంసా డివిజన్ లోని కుబీర్ మండలం పలిసి గ్రామంలో సోమవారం బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు బీరప్ప ఆలయంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం పౌర్ణమి మాసాన్ని పురస్కరించుకొని, ఈ వేడుకలను నిర్వహిస్తుండగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ మొక్కలను చెల్లించుకుంటారు.