calender_icon.png 28 January, 2026 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విపత్తు నిర్వహణ సంస్థలపై మంత్రి పొంగులేటి సమీక్ష

28-01-2026 04:17:05 PM

హైదరాబాద్: విపత్తు నిర్వహణ సంస్థలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సమీక్ష నిర్వహించారు. ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, విపత్తు నిర్వహణ విభాగాలతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ వ్యవస్థను దేశంలోనే రూల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విపత్తు నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

విపత్తు నిర్వహణ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మండల స్థాయి వరకు అత్యాధునిక వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భారీ బరువులు ఎత్తే డ్రోన్లు, హైస్పీడ్ బోట్లు కొనుగోలు చేయాలని సూచించారు. హైరైజ్డ్ భవనాల్లో అగ్నిప్రమాదాలను ఎదుర్కునేలా పరికాలు కొనాలని మంత్రి పొంగులేటి వెల్లడించారు.