28-01-2026 04:16:30 PM
ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ డిపో ద్వారా టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో జగన్నాథ్ పూర్ కు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసు నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. ఈ సర్వీసు ఫిబ్రవరి 4న నిర్మల్ డిపో నుండి ప్రారంభమవుతుందన్నారు. అన్నవరం, సింహచలం, అర్సవెల్లి, పూరి జగన్నాథ్, కోణార్క్, ద్వారక తిరుమలకు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ పిబ్రవరి 4 కు బయలుదేరి పిబ్రవరి 9 వ తేదీ తిరిగి నిర్మల్ చేరుకుంటుంది.
ఛార్జి వెళ్ళడానికి రావడానికి కేవలం 6400/- రూ!! లే ఉంటుందని, ఒరిస్సా రాష్ట్రములో గల శ్రీ కృష్ణ మందిరానికి వెళ్తున్న మొట్ట మొదటి బస్సు అని ప్రతి ఒక్కరు ఆధారించాలని వెళ్ళవలసిన వారు టిజిఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.inలో కాని మన నిర్మల్ నిర్మల్ బస్టాండ్ కౌంటర్ లో కాని ముందుగా బుక్ చేసుకోండి. మరింత సమాచారం కొరకు 9959226003,8328021517, లేదా 7382842582 లో సంప్రదించాలని డిపోమేనేజర్ తెలిపారు.