08-10-2025 02:01:07 PM
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ కొనసాగుతోంది. బుధవారం ఉదయం ప్రారంభమైన విచాణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు(Congress leaders) టెన్షన్.. టెన్షన్ లో ఉన్నారు. హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నవంబర్ 9ను సవాల్ చేస్తూ మాధవరెడ్డి పిటిషన్ వేశారు. 42 శాతం రిజర్వేషన్ల జీవోను కొట్టేయాలని హైకోర్టును కోరారు. బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్. కృష్ణయ్య, వీహెచ్, పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లపై హైకోర్టు సీజే ధర్మాసనం ఒకేసారి విచారిస్తోంది. రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఎప్పుడు ఆమోదించిందని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించారా?, రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమా? అని హైకోర్టు ప్రశ్నించింది.
50 శాతం రిజర్వేషన్లు మించరాదని రాజ్యాంగంలో(Constitution) స్పష్టంగా ఉందని పిటిషనర్ల న్యాయవాదులు సూచించారు. మహారాష్ట్రలో రిజర్వేషన్ల 50 శాతం దాటితే సుప్రీంకోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వల్ల 50 శాతం సీలింగ్ దాటిందని పిటిషనర్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఉందని పిటిషనర్లు సూచించారు. బీసీల రిజర్వేషన్లపై రాజ్యాంగం రాష్ట్రాలకే అధికారం ఇచ్చిందని చెప్పారు. సీలింగ్ 50 శాతం దాటొద్దని రాజ్యాంగంలో పేర్కొన్న విషయాన్ని తెలిపారు. బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్లతో కలిపితే 67 శాతానికి చేరిందని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. బీసీల జనగణపై ఏకసభ్య కమిషన్ నివేదిక పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ జీవో 9,41 ను సవాలు చేస్తున్నామని పిటిషనర్లు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందా? అని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. ఆగస్టు 31న ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపారని న్యాయవాదులు సూచించారు. రిజర్వేషన్ల పెంపు(Reservations Increase) అధికారం ప్రభుత్వానికి ఉన్న 50 శాతం మించకూడదని పిటిషనర్లు అన్నారు. షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకే రిజర్వేషన్ల పెంపు అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించిందని పిటిషనర్లు న్యాయవాదులు తెలిపారు.