పవన్ కళ్యాణ్‌పై మతిభ్రమించి మాట్లాడుతున్న మంత్రి పొన్నం
జనసేన కరీంనగర్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి
కరీంనగర్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జనసేన పార్టీ సాధక్ లతో నవ నిర్మాణ సభకు వచ్చి జనసైనికులకు దిశ నిర్దేశం చేసేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు రావడాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంటు కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ లో పోటీ చేసేందుకు ఎన్నికలకు భయపడి ఇతర జిల్లాకు పారిపోయి అక్కడ ఇతర పార్టీల నాయకులతో చాటుమాటు ఒప్పందాలు చేసుకొని దొంగదారిలో గెలిచిన నువ్వు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఉరికించి కొడతారని బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.






