4 June, 2026 | 2:39 AM

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మహిళల మృతి

04-06-2026 01:54 AM

మరిపెడ మండలం భూక్య తండాలో ఘటన

మహబూబాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్య తండాలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరిపెడ ఎస్‌ఐ సతీష్ తెలిపిన వివరాల మేరకు భూక్య తండాకు చెందిన మాలోత్ శారద(36) ఈనెల 1న సూర్యాపేటలోని కంటి అసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోజు రాత్రి వాళ్ల బంధువుల ఇంట్లో ఉండి మంగళవారం సాయంత్రం తన గ్రామానికి వచ్చింది.

ఇంటి ప్రక్కన్న గల మాలోత్ నీలతో శారద ఇంటి బయట మాట్లాడుతుండగా నీల (40) కళ్లు తిరుగుతున్నాయంటూ ఆకస్మాతుగా స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయం గమనించిన శారద నీలకు సీపీఆర్ చేస్తుండగా చుట్టూ పక్కల ఇండ్ల గ్రామస్తులు కూడా వీళ్ల దగ్గరికి వచ్చారు. అప్పటికే శారద, నీల ఇద్దరు కూడా ఆపస్మారక స్థితిలో కనిపించారు.  వారి ని  మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి అప్పటికి  చనిపోయార ని ధ్రువీకరించారు. మృతురాలు నీల కుమారుడు పోలీసులు అనుమానాస్పద మృతి కిం ద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.