1 April, 2026 | 6:48 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

సెంటిమెంట్‌కు అనుగుణంగా 'తెలంగాణ తల్లి'

09-12-2024 12:15 PM

తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వపరంగా లేదు

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... తెలంగాణ రావడానికి కారణం సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణ చిహ్నంలో మార్పు జరగలేదన్నారు. తెలంగాణ గీతాన్ని రూపొందించి అధికారికంగా ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. గతంలో ఉన్న విగ్రహాలు పార్టీకి సంబంధించినవని ఆరోపించిన మంత్రి పొన్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ పరంగా లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ కు అనుగుణంగా విగ్రహం తయారు చేసినట్లు వివరించారు. ఇటీవల వరదలు వస్తే కేంద్రం కేవలం రూ.  400 కోట్లు ఇచ్చిందని ఆరోపించిన పొన్నం ప్రభాకర్ కేంద్రం నుంచి నిధుల సాధనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా అందరూ పనిచేయాలని కోరారు.