13 May, 2026 | 10:39 AM

ట్రోల్ తట్టుకోలేక.. రిషబ్ సాయాన్ని.. గంటలోపే రిటర్న్ చేసిన స్టూడెంట్ !

28-08-2024 11:51 AM

ముంబాయి: అమ్మ పెట్టదు.. అడుక్క తిననివ్వదు అన్నట్లు ఉంది.. ఈ ట్రోలింగ్ యవ్వారం.. సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ గాళ్ల  విద్వేషం  రోజుకో వెర్రి తలలు తొ క్కు తోంది.. ఓ విద్యార్థి సాయం తనకు చేయాలని  కోరగా రిషబ్ పంత్ స్పందించాడు. కాగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ తట్టుకోలేని  ఆ విద్యార్థి గంటలోపే ఆ మొత్తన్ని తిరిగి పంత్కి చెల్లించాడు. తన కాలేజీ ఫీజు కట్టడానికి ఎంతో కష్ట పడుతున్నానని సాయం చేయాలంటూ  కార్తీకేయ మౌర్య, అనే విద్యార్థి భారత క్రికెటర్ రిషబ్ పంత్ ని ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. దీనికి పంత్ స్పందించిన తీరు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. అయితే  సదరు విద్యార్థి పంత్ ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లిస్తానని ప్రకటించడం కొసమెరుపు. రిషబ్ లాంటి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ ను  డబ్బుల రూపంలో సాయం అడుగుతావా?.. అంటూ కార్తీక్ పై కొందరు ఆన్ లైన్ లో ద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం తట్టుకోలేకపోయాడు. తదనంతరం రిషబ్ సాయాన్ని మళ్లీ తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు కార్తీక్  మళ్లీ పోస్ట్  పెట్టాడు.