calender_icon.png 8 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి

08-10-2025 06:47:18 PM

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్ మాదిగ..

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్బంగా మైనార్టీలు ఏర్పాటు చేసిన సభకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి జంతువులతో పోల్చినటువంటి అహంకారపు మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల మా మాదిగల ఆగ్రానికి గురిగాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాలరాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు దీకొండ కుమారస్వామి, జిల్లా అధికార ప్రతినిధి అలవాల రవీందర్, కొత్తపెళ్లి మండల అధ్యక్షుడు కిన్నెర అనిల్ కుమార్, చిగురుమామిడి మండల అధ్యక్షురాలు విశాలి,  తదితరులు పాల్గొన్నారు.