08-10-2025 06:43:55 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఆటో యూనియన్ నాయకులుగా మెట్ పల్లికి చెందిన వారు ఎన్నిక కావడంతో వారిని బుధవారం పట్టణ రెండవ ఎస్ఐ రాజు నాయక్ సన్మానం చేశారు. బస్ డిపో చౌరస్తా ఆటో యూనియన్ కు చెందిన గుగులావత్ శివలాల్ నాయక్ జిల్లా నూతన అధ్యక్షులుగా, జనరల్ సెక్రెటరీగా రంగు సంపత్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వెంకటరమణ ఎన్నికైన సందర్భంగా మెట్ పల్లి బస్ డిపో ఆటో చౌరస్తా అసోసియేషన్ వద్ద ఎస్సై వారిని శాలువతో సన్మానం చేసి అభినందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని, ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలని డ్రైవింగ్ లైసెన్స్ కు సక్రమంగా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరేందర్, కోశాధికారి లక్ష్మణ్, ఐలయ్య, కనకయ్య, రామ్ రెడ్డి నారాయణ, శ్రీనివాస్, పరుశురాం, దాసరి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.