17 April, 2026 | 8:57 PM

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి రాజనర్సింహ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

07-06-2025 12:46 AM

యాదాద్రి భువనగిరి జూన్ 6 (విజయ క్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు శుక్రవారం నాడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో వెంకట్రావు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పురోహితులు వారిని శాలువాలు కప్పి ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.