calender_icon.png 14 September, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి: మంత్రి సీతక్క

14-09-2025 02:43:04 PM

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడోత్సవాల ముగింపు సభకు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) హాజరయ్యారు. ఏకలవ్య పాఠశాలల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల విజేతలకు మంత్రి సీతక్క అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(EMRS) నుండి 1200 మంది విద్యార్థులను ఎంపిక చేసి.. గిరిజన సంక్షేమ శాఖ ఈ పోటీలను నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణకు గర్వకారణం తీసుకురావాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని.. నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి తాము మెస్ ఛార్జీలను పెంచామని పేర్కొన్నారు. గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైన విద్యార్థులు ముందుకు సాగాలని, రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నమని తెలిపారు.