14-09-2025 03:26:54 PM
హైదరాబాద్: నాగోల్ పోలీస్ స్టేషన్(Nagole Police Station) పరిధిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోశాడు. ఓంగోలుకు చెందిన మహాలక్ష్మి, వేణుగోపాల్ లకు ఏడాది క్రితం వివాహం జరిగింది. వేణుగోపాల్ తాగుడుకు బానిసై భార్యను తీవ్రంగా వేధించేవాడు. భర్త వేదన భరించలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వేణుగోపాల్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినా అతడు తీరు మార్చుకోలేదు. ఆదివారం బంధువుల ఇంటికి వెళదామని భార్య కోరగా ఆమెతో వేణుగోపాల్ గొడవపడ్డాడు. ఇదే నేపథ్యంలో కోపంతో బ్లేడుతో భార్యను గొంతు కోశాడు. గమనించిన స్థానికులు మహాలక్ష్మిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగోల్ పోలీసులు వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.