23-12-2025 05:10:44 PM
రాజమాత దేవాలయంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ రాజమాత దేవాలయంలో మంగళవారం శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలను అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కళ్యాణం వేడుకల్లో కొమురవెల్లి అంజయ్య శోభారాణి, కొడుకు కోడలు మారుతి కల్పన , పాత శ్రీనివాస్ మల్లేశ్వరి, పల్లెపు శేషయ్య కోటేశ్వరమ్మ దంపతులు పాల్గొన్నారు. పూజారి దత్తాత్రేయ దంపతులచే కళ్యాణ వేడుకలను ఘనంగా జరిపించారు. అనంతరం కొమురవెల్లి అంజయ్య శోభారాణి దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.