calender_icon.png 23 December, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రుపాలెం గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం

23-12-2025 04:40:42 PM

ఎర్రుపాలెం,(విజయ క్రాంతి): మండలంలో ఉన్న 31 గ్రామాల సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని మండల ఎంపీడీవో సురేందర్ పేర్కొన్నారు. సోమవారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సర్పంచులు, ఉప సర్పంచ్ల, పాలకమండలి సభ్యుల పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఆయా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఎర్రుపాలెం గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పాలక మండల సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీడీవో సురేందర్ పాల్గొని ప్రసంగించారు. స్థానిక రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చెందించాలని, కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను గ్రామంలోని ప్రతి ఇంటికి అందించాలని పేర్కొన్నారు.

కొత్తగా ఎన్నికైన సర్పంచ్,  ఉప సర్పంచ్ , పాలకమండ సభ్యులకు ఎంపీడీవో శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలు తో సన్మానించారు. సర్పంచ్ నండ్రు అశ్విని మాట్లాడుతూ తనను నూతన సర్పంచిగా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని, జిల్లాలోనే మోడల్ పంచాయతీగా ఉండేటట్లు తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ ఎస్ కే శాబాష్ మాట్లాడుతూ ప్రజలందరూ మా మీద నమ్మకంతో గెలిపించారని ఈ మా గెలుపుకు ఆత్మ కమిటీ అధ్యక్షులు కంచర్ల వెంకట నరసయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎస్కే ఇస్మాయిల్ సూచన సలహాలతో ప్రణాళిక బద్ధంగా విజయం సాధించాం.

ఈ విజయంతో మేము  ఈ పదవులను మరింత బాధ్యతతో సక్రమంగా వినియోగిస్తూ పని చేస్తామని గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కంచర్ల వెంకట నరసయ్య మాట్లాడుతూ గ్రామాన్ని రాష్ట్రంలోనే మోడల్ గ్రామంగా ఉంచాలని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచనలు సలహాలతో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షుడు ఎస్కే ఇస్మాయిల్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ రాష్ట్ర సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరుస్తామని వివరించారు. గ్రామాభివృద్ధికి పాల్పడతామని దీనికి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచన సలహాలతో మరింత ముందుకి తీసుకెళ్తామని వివరించారు. 

అంతకుముందు గ్రామపంచాయతీలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ నండ్రు అశ్విని, ఉపసర్పంచ్ ఎస్.కె శభాష్, 11  మంది వార్డ్ మెంబర్స్ చేత పదవీ ప్రమాణ స్వీకారం గ్రామపంచాయతీ సెక్రటరీ జి ఏలేశ్వరావు చేయించారు. ఈ కార్యక్రమంలో ,  జమలాపురపు పెద్ద కృష్ణయ్య, డి  బుచ్చిబాబు, కంచర్ల శ్రీనివాసరావు, సూరం శెట్టి రాజేష్, కామిశెట్టి శివ బాజీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు జానీ , హుస్సేన్, మహబూబా సుభాని, అన్వర్, అల్లా బక్షి, తురభ జీప్ కార్ మహబూబ్ గంధం రాధాకృష్ణ, సామల నర్సిరెడ్డి రావూరి నాగబాబు ,గోగినేని సూరి ,శివాలయం చైర్మన్ జయ శ్రీ, గద్దల శ్రీనివాసరావు, నండ్రు వెంకటేశ్వరరావు, నండ్రు క్రాంతి కుమార్, నండ్రు కోటేశ్వరరావు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బంది శ్రీను, హరి తదితరులు పాల్గొన్నారు.