calender_icon.png 23 December, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చొప్పదండి మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా అనిల్

23-12-2025 05:24:17 PM

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్నకొండ గ్రామ ఉప సర్పంచ్ జక్కుల అనిల్  కుమార్ ని చొప్పదండి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ నాయకులు, సహచర ఉప సర్పంచులు ఘనంగా సన్మానించారు. అనంతరం జక్కుల అనిల్ మాట్లాడుతూ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునందుకు ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుతూ మండలంలోని ఉప సర్పంచ్ ల అన్ని సమస్యలను పరిష్కరిస్తూ చొప్పదండి శాసన సభ్యులు డా. శ్రీ మేడిపల్లి సత్యం సత్యం సూచనలతో గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి ఉప సర్పంచ్ ల సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో సాంబయ్యపల్లె ఉప సర్పంచ్ కొత్తపల్లి నవీన్ కుమార్, వెదురుగట్ట ఉప సర్పంచ్ మారం సమత శ్రీనివాస్, మంగళపల్లి ఉప సర్పంచ్ ఎవన్ రెడ్డి, చిట్యాలపల్లి ఉప సర్పంచ్ సాయికిరణ్, గుమ్లాపూర్ ఉప సర్పంచ్ రమణారెడ్డి, చాకుంట ఉప సర్పంచ్ ఎముండ్ల చంద్ర శేఖర్, కొలిమికుంట ఉప సర్పంచ్ పంజాల లక్ష్మణ్, రాగంపేట ఉప సర్పంచ్ కళ్లెం రవీందర్ రెడ్డి, భూపాలపట్నం ఉప సర్పంచ్ మునిగాల నరేష్, పెద్ద కుర్మపల్లె ఉప సర్పంచ్ కుకట్ల జలజ రాజేశం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం చందు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమండ్ల గంగయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ కొట్టే అశోక్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.