calender_icon.png 23 December, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీబీ- జీరామ్ జీ పేరు మార్చాలని సీపీఐ ఆందోళన

23-12-2025 04:46:50 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేశారు. తొలుత పాత జీఎం ఆఫీస్ క్రాస్ రోడ్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి సీపీఐ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి ఉన్న మహాత్మా గాంధీ పేరును రద్దుచేసి, వీబీ- జీ రామ్ జీ  పేరును పెట్టడాన్ని వ్యతిరేకించారు.

నరేంద్ర మోడీ గ్రామీణ ఉపాధి పథకాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ చర్యకు పాల్పడిందని ఆందోళనకారులు విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరునే తిరిగి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రజా వ్యతిరేక, మతో న్మాద పాలనపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, మండల కార్యదర్శి బీ. లక్ష్మీనారాయణ, సీపీఐ నాయకులు బాపు, రత్నం రాజం, డీఆర్ శ్రీధర్, బియ్యాల ఉపేందర్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.