23-12-2025 05:14:48 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): డిసెంబర్లో చేసే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని గతంలో పెండింగ్లో ఉన్న లిప్రెసి, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు వెంటనే చెల్లించాలని ఫిక్స్డ్ వేతనం 18000 చెల్లించాలని కోరుతూ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే కేంద్రం పెంచిన పారితోషకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా అమలు చేయాలని,2021 జులై నుండి డిసెంబర్ 6 వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్ వెంటనే చెల్లించాలి.
గత 15 రోజుల సమ్మె హామీలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టిలో పొందుపరచిన హామీలు 2024 ఫిబ్రవరి 9న, 2025 సెప్టెంబర్ 1న,జులై 30న,డిసెంబర్ 10న,రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని,గతంలో హామీ ఇచ్చిన ఆశవర్కర్లకు ఇన్సూరెన్స్ 50 లక్షలు చెల్లిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని,ఇస్తున్న పారితోషికాలలో సగం పెన్షన్ నిర్ణయించాలని, గత ప్రభుత్వం హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.
ఆశవర్కర్లు చేస్తున్న పారితోషికం లేని పనులన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలని కోరారు.ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని పారితోషికం లేని పనులు చేయించకూడదన్నారు.మరియు వివిధ పెండింగ్ సమస్యలపై వినతి పత్రంలో పేర్కొని స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారు సృజన్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు సప్న,సిద్ధవ్వ, అనిత,శివలక్ష్మి,సల్మా, చిట్టెమ్మ,విజయ,హైమద్ బేగం,పుష్ప,సావిత్రి,అంజమ్మ, యాదమ్మ,రాజేశ్వరి,భూదేవి, మంజుల,మల్లవ్వ,మంజుల, మార్తమ్మ,యేసుమని,జ్యోతి పాల్గొన్నారు.