calender_icon.png 20 January, 2026 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో జాతీయ జెండాను ఎగురవేస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు

18-09-2024 01:21:55 AM

కరీంనగర్(విజయక్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎగురవేశారు. సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో తెలంగాణ నిజాం చెర నుంచి విముక్తి పొంది, అఖండ భారత్‌లో విలీనమైందని అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. కరీంనగర్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి శ్రీధర్‌బాబు నివాళులర్పించారు.