చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అనారోగ్యంతో బాధపడుతున్న సుగుణకు మంత్రి శ్రీధర్‌బాబు భరోసా
మంథని, ఆగస్టు 26 (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్హర్రావు మండలం వల్లెంకుంట గ్రామానికి చెందిన పవిరాల సుగుణకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహా యనిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు.
వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమని మంత్రి శ్రీధర్బాబు దృష్టికి సుగుణ కుటుంబ సభ్యులు తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆస్పత్రి సహాయకులు సుగుణ కుటుంబ సభ్యు లకు ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు. అనారోగ్య సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు సుగుణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






