27 August, 2026 | 1:53 AM

పాలనురగలా.. జాలువారుతున్న మానేరు..!

27-08-2026 12:00 AM

గంభీరావుపేట, ఆగస్టు 26 (విజయక్రాంతి): పాలనురగలా జాలువారుతూ, పాలధారలా పరవళ్లు తొక్కుతున్న నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు ప్రకృతి అందాలతో కళకళలాడుతోంది. ఎగువ ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు ద్వా రా ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది.

దీంతో ప్రాజెక్టు మత్తడి దూకుతూ జలసవ్వడులతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.ఈ అందాలను ఆస్వాదించేందుకు ఉమ్మడి కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లా ల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మానేరు జలపాతం రూపంలో క నువిందు చేస్తూ ప్రకృతి ప్రేమికులను మం త్రముగ్ధులను చేస్తోంది.ఈ జలపాతం అం దాలను చూడక మానేరు...