calender_icon.png 20 November, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

24-07-2024 01:17:13 PM

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సభలో చర్చ జరిగింది. తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాలను కేంద్రం పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. తమ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏపీకి కేంద్రం ఏమిచ్చినా తమకు అభ్యంతరం లేదన్న శ్రీధర్ బాబు దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోలేదన్నార. సమైక్య స్ఫూర్తి దెబ్బతినేలా నిన్నటి కేంద్ర బడ్జెట్ ఉందని మంత్రి వెల్లడించారు.