calender_icon.png 20 November, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర వైసీపీ అధినేత జగన్‌ ధర్నా

24-07-2024 12:58:49 PM

న్యూఢిల్లీ: పీలో జరుగుతున్న దారుణాలకి నిరసనగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాకి ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ మద్దతిచ్చారు. జగన్‌ బుధవారం ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నాకు దిగారు. సాయంత్రం 5గంటల వరకు నిరసన కార్యక్రమం కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జగన్‌ నిరసన చేపట్టారు. అఖిలేష్‌ యాదవ్‌ జగన్‌ ధర్నాకు సంఘీభావం ప్రకటించించారు. ఏపీలో దాడులపై వీడియో రూపంలో అఖిలేష్‌కు జగన్‌ వివరించారు.